ఏపీలో రోజురోజుకి పెరుగుతున్న వైసీపీ నాయకుల అరాచకాలు.. తాజాగా..

ఏపీలో రోజురోజుకి పెరుగుతున్న వైసీపీ నాయకుల అరాచకాలు.. తాజాగా..

ఏపీలో రోజురోజుకి వైసీపీ నాయకుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాల్ని, వైసీపీ నేతల అక్రమాలను ప్రశ్నిస్తే ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడుతున్నారు. టీడీపీ నాయకులే టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు. వైసీపీ తీరును నిరసిస్తూ కర్నూలు జిల్లా బనగానపల్లిలో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట టీడీపీ ధర్నా నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. టీడీపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ.... కార్యకర్తలతో కలిసి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట భైఠాయించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వైసీపీ వర్గీయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అటు కడప జిల్లాలోనూ అక్రమ కేసులతో టీడీపీ నేతల్ని వేధిస్తున్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌ను రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప నుంచి ప్రత్యేక వాహనాల్లో పీఎస్‌కు తరలించారు. వైసీపీలో చేరలేదనే అక్కసుతో తనపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని హరిప్రసాద్ అన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు.

మరోవైపు కృష్ణాజిల్లాలోనూ ఓ వైసీపీ నాయకుడు పోలీసులపై దౌర్జన్యానికి దిగాడు. జడ రాంబాబు అనే వైసీపీ యువజన నాయకుడు పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడు. జి. కొండూరు మండలం గంగినేని చెక్ పోస్టు వద్ద అడ్డంగా పార్క్ చేసిన కారును తీయమన్నందుకు కానిస్టేబుల్‌పై చిందులేశాడు.

Tags

Read MoreRead Less
Next Story