YCP ATTACK: జనసేన నేతలపై వైసీపీ దాడి

నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో వైసీపీ నాయకులు మరోసారి రెచ్చిపోయారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న జనసేన నాయకులపై దాడికి తెగబడ్డారు. సంగం మండలం అనసూయనగర్ సమీపంలోని పెన్నా పరివాహక ప్రాంతం నుంచి... స్థానిక వైసీపీ నాయకులు భారీ వాహనాలతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. దీన్ని స్థానికులు అడ్డుకున్నారు. భారీ వాహనాలు తిరగడం వల్ల రోడ్లు, ఇళ్లు దెబ్బతింటున్నాయని శనివారం వాహనాలను నిలువరించారు. వారిపై వైసీపీ నేతలు బెదిరింపులకు దిగారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ...స్థానికులకు మద్దతుగా నిలిచారు. అక్రమ ఇసుక వాహనాలు అడ్డుకొని ఆందోళన చేశారు . ఘటనా స్థలికి చేరుకున్న వైసీపీ నాయకులు ఒకసారిగా జనసేన శ్రేణులపై మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు . విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది . దాడి చేసిన వారిపై జనసేన నేత నలిశెట్టి శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం శివారు ప్రాంతం నాన్ చెరువులో వైసీపీ నేతలు యథేచ్ఛగా సహజ వనరులను దోపిడీ చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్.. కాపు రామచంద్రారెడ్డి అండదండలతో రాయదుర్గం వైకాపా నేత బోర్వెల్ నాగిరెడ్డి... ఇష్టారీతిన ఇసుక, మట్టిని తవ్వేస్తున్న అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూబకాసురులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com