తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన అధికార పార్టీ నేతలు
సామాన్యులు చేసే తప్పులపై కఠినంగా స్పందించే విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు.. అధికారపక్ష నేతలను పల్లెత్తు మాట అనలేదన్న ఆరోపణలు..

తిరుమలలో నిబంధనల ఉల్లంఘనలు ఆగడం లేదు. ఏకంగా అధికారపక్ష నాయకులే యథేచ్ఛగా రూల్స్‌ను అతిక్రమిస్తున్నారు. తిరుమలలో డ్రోన్ కెమెరాల వాడకం నిషేధం. ఈ విషయం అందరికీ తెలిసినా.. రాజంపేట మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి పాదయాత్రను చిత్రీకరించేందుకు డ్రోన్ కెమెరాను వినియోగించారు. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాన్యులు తెలిసీ తెలియక చేసే తప్పులపై కఠినంగా స్పందించే.. విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు.. అధికారపక్ష నేతలను మాత్రం పల్లెత్తు మాట అనలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
Next Story