దేవుడి భూములను సైతం వదలట్లేదు

శ్రీసత్యసాయి జిల్లాలో దేవుడి భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారు. పెనుకొండ నియోజకవర్గంలోని గోరుంట్ల మండలం బుదిలి గ్రామంలో దేవుడి మాన్యాన్ని కబ్జా చేశారు YCP నేతలు. అయితే ఈ అంశంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన గ్రామస్తులను పోలీసులు జైళ్లో వేసి కొడతా మని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.మేం అధికార పార్టీ నేతలం..ఏమైనా చేస్తామంటూ సదరు YCP నేతలు గ్రామస్తులకు హుకుం జారీ చేశారు.
ఇదే అంశం MLA దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయ భూములను కాపాడాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. 70 సంవత్సరాల క్రితం ఆలయానికి 4 ఎకరాల 84 సెంట్ల భూమిని ఓ మహిళ విరాళంగా ఇచ్చింది. అందులో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు 75 సెంట్లు ఆలయ కమిటీ ఇచ్చింది.మిగిలిన 4 ఎకరాల 9 సెంట్లను కబ్జా చేసిన వైసీపీ నేతలు ఆ భూమికి కంచె వేసే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com