YCP Liquor Leaders : వైసీపీ నేతల అరాచకం.. నిమజ్జన ఉత్సవంలో విచ్చల విడిగా మద్యం పంపిణీ..

YCP Liquor Leaders : వైసీపీ నేతల అరాచకం.. నిమజ్జన ఉత్సవంలో విచ్చల విడిగా మద్యం పంపిణీ..
X
YCP Liquor Leaders : వినాయక చవితి వేడుకలంటే.. అందరూ భక్తిశ్రద్ధలతో చేస్తారు. కానీ ఏపీలో అధికార పార్టీ నేతలు మాత్రం తమ భక్తిని ప్రత్యేకంగా చాటుకున్నారు

YCP Liquor Leaders : వినాయక చవితి వేడుకలంటే.. అందరూ భక్తిశ్రద్ధలతో చేస్తారు. కానీ ఏపీలో అధికార పార్టీ నేతలు మాత్రం తమ భక్తిని ప్రత్యేకంగా చాటుకున్నారు. అధికార పార్టీ నేతలం.. తమకు అడ్డు చెప్పేదెవరు? అని అనుకున్నారేమో. ఏకంగా సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో వైసీపీ నేతలు బరితెగించి వినాయకుడి ఊరేగింపులో విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశారు. ట్రాక్టర్ మీద పెద్ద డ్రమ్ములో మద్యం నింపారు. ఊరేగింపునకు వచ్చిన వారికి వైసీపీ నాయకులు బహిరంగంగానే మద్యం పంపిణీ చేశారు. ఈ వినాయక ఉత్సవాలకు ధర్మకర్త తాడేపల్లి పట్టణ వైసీపీ అధ్యక్షుడు బర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి. స్థానిక ఎమ్మెల్యే, పోలీసుల సమక్షంలోనే ఈ తతంగమంతా నడవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వినాయక నిమజ్జన జరిగిన ఊరేగింపులో ఏకంగా డ్రమ్ములోనే మద్యం నింపారు. డ్రమ్ముకు ప్రత్యేక ట్యాప్‌నూ ఏర్పాటు చేశారు. మద్యం నింపిన డ్రమ్ములో నుంచి వచ్చినవారికి వచ్చినట్టుగా గ్లాసుల్లో మద్యం పోసి అందరికీ కిక్కెక్కించారు. వైసీపీ నేతలు పంపిణీ చేసిన మద్యం కోసం జనాలు కూడా ఎగబడ్డారు. గణేష్ నిమజ్జనంలో ఇదేం మద్య ఉత్సవం అని హిందూ సంఘాలు, ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అధికారంలో ఉన్నాం కదా..? ఏంచేసినా చెల్లుబాటు అవుతుందనే వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

తాడేపల్లి గేటు సెంటర్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..పోలీసుల సమక్షంలోనే ఇలా గణేషుడి ఊరేగింపులో మద్యం పంపిణీ చేశారు. పోలీసులు చూసినా ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరించారు. అదే ఏ సాధారణ వ్యక్తులో ఇదే పనిచేస్తే పోలీసులు అత్యుత్సాహం మామూలుగా ఉండకపోయేది. అర్జంటుగా అరెస్ట్ చేసి కేసులు బనాయించేవారని సాక్షాత్తు అధికార పక్ష నాయకులే ఇలా చేయటంతో పోలీసులు ఏమాత్రం పట్టనట్లుగా ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి.

Tags

Next Story