వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు వాయిస్‌తో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో

వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు వాయిస్‌తో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో
వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ఆడియో కాల్‌ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

బలవంతపు ఏకగ్రీవాలను అంగీకరించేది లేదని ఓవైపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సీరియస్‌గా చెబుతున్నారు. అయినా గాని, కొందరు రాజకీయ పెద్దలు.. నామినేషన్ వేస్తున్న వారిని బెదిరించి, పోటీ నుంచి తప్పుకునేలా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అభ్యర్ధులను బెదిరించిన ఘటనలు, ఆడియో కాల్స్ సైతం బయటకొచ్చాయి. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు.. ఓ అభ్యర్ధిని పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నించారని చెబుతున్న ఓ ఆడియో కాల్‌ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థి అల్లుడికి యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు ఫోన్ చేశారని అభ్యర్ధి బంధువులు ఆరోపిస్తున్నారు. నామినేషన్‌ వేసినందుకు కేసు పెట్టించి జైల్లో వేయిస్తానని ఎమ్మెల్యే బెదిరించారని అభ్యర్థి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడీ ఆడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు బెదిరించినట్టుగా ఆరోపిస్తున్న ఆడియో బయటపడటంతో అతనిపై కేసు పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కన్నబాబును కూడా అరెస్ట్ చేయాలని పట్టుబడుతున్నారు. అధికార పార్టీకి ఓ న్యాయం.. ప్రతిపక్షానికి ఓ న్యాయమా అంటూ పోలీసుల తీరును తప్పుబడుతున్నారు.


Tags

Read MoreRead Less
Next Story