Nawaz Basha: సోషల్ మీడియాలో రచ్చరేపుతున్న వైసీపీ ఎమ్మెల్యే వీడియో..

Nawaz Basha: మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషా అల్లరి ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ మనూజా రెడ్డితో పబ్లిక్‌గా పరాచకాలు చేయడాన్ని వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పెట్టారు. నలుగురిలో ఉన్నామని గాని, తానొక ఎమ్మెల్యేనని గాని, పక్కన గౌరవ స్థానంలో ఉన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ అన్న విషయాన్ని గాని మరిచిపోయి.. ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
మదనపల్లెలో రోడ్లకు సంబంధించిన నాడు-నేడు ఫొటొ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నవాజ్ బాషా, మున్సిపల్ ఛైర్‌పర్సన్ మనూజా రెడ్డితో పాటు వైస్ ఛైర్మన్, కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని వీడియో తీస్తుండగా.. తాను పొడుగ్గా ఉండడం, మున్సిపల్ ఛైర్ పర్సన్ మనూజా రెడ్డి పొట్టిగా ఉండడం వల్ల వీడియోలో కనపడరు అంటూ వ్యంగ్యంగా మాట్లాడినట్టు చెప్పుకుంటున్నారు.
ఒక ఎమ్మెల్యే అయి ఉండి.. మహిళా నేతను అలా భుజంతో తోయడం అసభ్యంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇలా పబ్లిక్‌గా మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తో అతి చనువు ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే తన స్థాయిని మరిచారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com