పోలీస్‌ అధికారిని నోటికొచ్చినట్లు దుర్బాషలాడిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

పోలీస్‌ అధికారిని నోటికొచ్చినట్లు దుర్బాషలాడిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ పోలీస్‌ అధికారిని నోటికొచ్చినట్లు ఆమె దుర్బాషలాడారు. తుళ్లూరు-2 సీఐ శ్రీహరిని బెదిరిస్తున్న..

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ పోలీస్‌ అధికారిని నోటికొచ్చినట్లు ఆమె దుర్బాషలాడారు. తుళ్లూరు-2 సీఐ శ్రీహరిని బెదిరిస్తున్న ఓ ఆడియో టేప్‌ ఆలస్యంగా వెలుగు చూడటంతో మరోసారి ఎమ్మెల్యే తీరు వివాదాస్పదమైంది. పోలీసులు పట్టుకున్న లారీలను విడిచిపెట్టాలని సీఐకి ఫోన్‌లో వార్నింగ్‌ ఇచ్చారు శ్రీదేవి. నా కాళ్లు పట్టుకుంటే నీకు పోస్టింగ్‌ ఇచ్చాను.. అలాంటిది నా మాట వినవా అంటూ రెచ్చిపోయారు. నువ్వు విడిచిపెడతావా.. లేదంటే ఎస్పీ, డీజీపీకి చెప్పి నీ సంగతి తేలుస్తానంటూ హెచ్చరించారు.

హలో.. ఎప్పటి నుంచి చెప్తున్నా.. వాళ్లను పంపేయొచ్చుగా.. నీకేమైనా మెంటలా అంటూ చెలరేగిపోయారు శ్రీదేవి. ఆ రోజు పట్టుకున్నప్పుడే నేను నీకు ఫోన్‌ చేశానా? లేదా? ఏం మాట్లాడుతున్నావంటూ రెచ్చిపోయారు. నేనంటే రెస్పెక్ట్‌ లేదా? అందరినీ అయితే వదిలిపెడతావ్‌.. నాన్సెస్‌.. నీవు పంపిస్తావా? లేదా చెప్పాలని ఫోన్‌లో హుకుం జారీ చేశారు. రెండు నిమిషాల్లో వెళ్లిపోతావ్‌.. ఎక్స్‌ట్రాలు చేయొద్దంటూ సీఐను హెచ్చరించారు శ్రీదేవి. ఎమ్మెల్యేను పట్టుకొని కార్యకర్తలా బిహేవ్ చేస్తావా అంటూ పోలీస్‌ అధికారితో ఇష్టారీతిన వ్యవహరించారు.

వైపీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాల్ని పట్టుకున్న పాపానికి ఓ సీఐపై ఎమ్మెల్యే శ్రీదేవి ఇలా బెదిరింపులకు దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఫోన్‌లో ఆవేశం, ఆగ్రహంతో ఊగిపోయారని.. తాను చెప్పినట్లు చేయకపోతే బెదిరింపులకు దిగడమేమిటంటున్నారు.

Tags

Next Story