అంతర్వేది ప్రమాదంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు

అంతర్వేది ప్రమాదంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు
అంతర్వేది ప్రమాదంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అంతర్వేది ప్రమాదంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఇది కావాలనే చేసిన విధ్వంసంగా కనిపిస్తోందని అన్నారు. ఈ ఘటన ఒక మతంపై దాడిచేసినట్లుగా ఉందని ఆరోపించారు రఘురామకృష్ణరాజు. గతంలోనూ ఇలాంటివి జరిగితే, పిచ్చివాడి చర్యగా పేర్కొంటూ కేసులు మూసివేశారని చెప్పారు. ఇప్పుడు కూడా ఆ విధంగానే చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు. సీఎం జగన్‌ వెంటనే డీజీపీతో మాట్లాడి అంతర్వేది ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక అంతర్వేది ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు తక్షణమే స్పందించారని ప్రకటన రిలీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయిలో వివరాలను సాక్ష్యాధారాలను సేకరించేందుకు పనిలో అధికారులు నిమగ్నమయ్యారు అని డీజీపీ ప్రకటనలో తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story