మంత్రి కొడాలి నానిని అభినందించి తీరాలి : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు

మంత్రి కొడాలి నానిని అభినందించి తీరాలి : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు
మంత్రి కొడాలి నానిని అభినందించి తీరాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.. మూడు రాజధానులంటూ మసిపూసి..

మంత్రి కొడాలి నానిని అభినందించి తీరాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.. మూడు రాజధానులంటూ మసిపూసి మారేడు కాయ చేద్దామని ఇన్నాళ్లూ చూశారని.. ఉన్నది ఒకటే రాజధాని అది అమరావతి నుంచి విశాఖ తరలిస్తున్నారని అన్నారు. కోర్టులో ఈ అంశం నడుస్తుండగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.. రాజధాని కట్టరు గానీ, రైతులిచ్చిన భూమిని పేదలకు పంచుతారా అని రఘురామకృష్ణరాజు నిలదీశారు.

స్మార్ట్‌ మీటర్ల పేరుతో రైతులను ఆందోళనకు గురిచేయడం సరైన విధానం కాదని రఘురామకృష్ణరాజు అన్నారు.. అన్నమాట నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో వున్న సమయంలో ఇలాంటి చర్యలు సరికాదన్నారు.

కొత్త విద్యా విధానంపై మాట్లాడినందుకు అభినందించడం మానేసి తనపైనే వేటు వేయాలని ఢిల్లీ చుట్టూ తిరగడం మంచి పద్ధతి కాదన్నారు రఘురామకృష్ణరాజు. తనను డిస్‌క్వాలిఫై చేయలేరన్నారు. కొంతమందిని పక్కనపెట్టుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు.. అలాంటి వారి మాటలు వినకుంటేనే మంచిదని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story