రాజ్యసభలో సబ్జెక్ట్ దాటి మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

రాజ్యసభలో కొవిడ్‌పై చర్చ సందర్భంగా.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సబ్జెక్ట్ దాటి మాట్లాడంపై... డిప్యూటీ చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొవిడ్‌పై చర్చ ప్రారంభించి... ఏసీబీ విచారణ, కోర్టుల జోక్యం అంటూ.. ఇతర అంశాలను విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. డిప్యూటీ చైర్మన్ అనేకమార్లు.. వారిస్తున్నా విజయసాయిరెడ్డి తనధోరణిలో వెళ్లిపోయారు. సంబంధింత అంశానికి మాత్రమే పరిమితం కావాల్సిందిగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సూచించారు.
విజయసాయి చర్చను తప్పుదోవపట్టిస్తున్నారని... టీడీపీ ఎంపీ కనకమేడల అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలోని అంశాలపై పార్లమెంటులో మాట్లాడం ద్వారా... కోర్టులనుకూడా.. బెదిరింపులకు పాల్పడుతున్నారని కనకమేడల ఆరోపించారు. కరోనా నియంత్రణ చర్యలపై మాట్లాడాల్సిన చోట... ఇతర అంశాలను ప్రస్తావించడం ఏమిటన్నారు కనకమేడల.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com