ఏపీలో వైసీపీ మరోసారి కవ్వింపు చర్యలు

ఏపీలో వైసీపీ మరోసారి కవ్వింపు చర్యలు
మహానాడుకు పోటీగా అనంతపురంలో ఫ్లెక్సీల ఏర్పాటు వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వైసీపీ నాయకులు

ఏపీలో అధికార పార్టీ అడ్డంకులకు హద్దే లేదు. టీడీపీ చేపట్టే ప్రతి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్న వైసీపీ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. టీడీపీ మహానాడు జరుగుతున్న వేళ అనంతపురంలోని ప్రధాన సర్కిళ్లలో వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం అంటూ వైసీపీ నాయకులు ఫ్లెక్సీలు పెట్టారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫ్లెక్సీలను వెంటనే తొలగించకపోతే తామే ఫ్లెక్సీలను తొలగిస్తామని తేల్చిచెప్పారు. వైసీపీ ఫ్లెక్సీలను తొలగిస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ప్రభాకర్‌ చౌదరి వెనుతిరిగారు.Tags

Read MoreRead Less
Next Story