AP: ప్రేమించలేదని యువతిపై యాసిడ్ దాడి

AP: ప్రేమించలేదని యువతిపై యాసిడ్ దాడి
X
పరిస్థితి విషమం.. తీవ్రంగా ఖండించిన హోంమంత్రి

తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై దారుణాలు ఆగడం లేదు. వరుస దారుణాలు వెలుగు చూస్తూ మహిళలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో శుక్రవారం ఉదయం యువతిపై అఘాయిత్యం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని ఇద్దరు వ్యక్తులు నిర్భంధించి దాడి చేశారు. ఆమెను కత్తులతో పొడిచి, నోట్లో యాసిడ్ పోసి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 108లో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. యువతి (23)ని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.

అసలు ఏం జరిగిందంటే..?

ఏప్రిల్ 29న సదరు యువతికి తల్లిద్రండులు పెళ్లి నిశ్చయం చేశారు. దీంతో గణేష్ యువతిపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అనుభవించి అంతమొందించాలని అనుకున్నాడు. యువతి ఒంటిరిగా వెళ్తుండగా.. గణేష్ ఆమెను వెంబడించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తలపై కత్తితో పొడిచాడు. అనంతరం నోట్లో యాసిడ్ పోసి ఆమెపై అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్రంగా గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

హోంమంత్రి సీరియస్

మదనపల్లెలో యువతిపై జరిగిన యాసిడ్‌ దాడి ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ నుంచి ఆమె వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులతోనూ ఫోన్లో మాట్లాడిన అనిత.. వాళ్లకు భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం యువతిని బెంగళూరు ఆసుపత్రికి తరలించేందుకు ఆమె ఏర్పాట్లు చేశారు. నిందితుడిని ఎట్టిపరిస్థితితుల్లో విడిచిపెట్టొద్దని, అతనికి కచ్చితంగా శిక్షపడేలా చూడాలని పోలీసులను హోంమంత్రి ఆదేశించారు.

Tags

Next Story