సెల్‌టవర్‌ ఎక్కి యువకుడు హల్‌చల్ : బాబోయ్ తేనెటీగలు నేను దిగుతా..

సెల్‌టవర్‌ ఎక్కి యువకుడు హల్‌చల్ : బాబోయ్ తేనెటీగలు నేను దిగుతా..

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో... రోహిత్‌ అనే యవకుడు సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్ చేశాడు. స్థానిక ఎమ్మార్వో ఆఫీస్‌ ముందున్న సెల్‌ టవర్‌ ఎక్కిన రోహిత్‌... రాత్రంతా అక్కడే ఉన్నాడు. తాను.. ఓ యువతిని ప్రేమిస్తున్నానని... అయితే తాను వేధిస్తున్నట్టు ఆమెతో బలవంతంగా కేసులు పెట్టారని.. రోహిత్ ఆరోపిస్తున్నాడు. అటు... నిన్న రాత్రి కానిస్టేబుల్‌పై రోహిత్‌ దాడికి దిగాడు. యువతి కేసు పెట్టడంలో స్థానిక వైసీపీ నేత హస్తం ఉందని రోహిత్ ఆరోపిస్తున్నాడు. రోహిత్‌ను కిందకు దించడానికి.. బంధువులు, పోలీసులు రాత్రంతా ప్రయత్నించారు. కానీ ఆ యువకుడు కిందకు దిగడానికి ససేమిరా అన్నాడు. దీంతో రాత్రి పోలీసులు వెళ్లిపోయారు. అటు.. తేనెటీగలు దాడి చేయడంతో కాసేపటి కిందటే రోహిత్‌ సెల్‌టవర్ దిగి కిందకు వచ్చాడు.

Tags

Read MoreRead Less
Next Story