AP: గ్లోబల్ యంగ్ లీడర్‌గా రామ్మోహన్ నాయుడు

వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ యంగ్ లీడర్ జాబితాలో టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబరిచిన యువ నాయకులను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంపిక చేస్తుంది. ఈసారి భారత్ నుంచి ఏడుగురు ఎంపికయ్యారు. ఇందులో రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా ‘ యంగ్ గ్లోబల్ లీడర్’గా ఎంపిక కావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు. ముఖ్యమైన, ప్రభావితమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో భారత యువత ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. 2014లో 26 ఏళ్ల అతి చిన్న వయసులో పార్లమెంట్ సభ్యుల్లో ఒకరిగా ఉన్న రామ్మోహన్ నాయుడు.. 2024 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యంగ్ గ్లోబల్ లీడర్‌గా ఎంపికైన రామ్మోహన్ నాయుడుకి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు దేశానికి, ముఖ్యంగా తెలుగువారికి గర్వకారణమన్నారు.ప్రజాసేవలో రామ్మోహన్ అంకితభావం.. యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. రామ్మోహన్ యంగ్ గ్లోబల్ లీడర్‌గా ఎంపిక కావడం ఏపీకి, భారత్‌కు గర్వకారణమని మంత్రి లోకేశ్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com