YCP: భయంతో వణికిపోతున్న వైసీపీ యాక్టివిస్టులు..!

YCP: భయంతో వణికిపోతున్న వైసీపీ యాక్టివిస్టులు..!
X
శ్రీరెడ్డి వీడియోతో ఆత్మరక్షణలో వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారులు... అప్పుడు దారుణ కామెంట్లు

వివాదాస్పద నటి, యూట్యూబర్, వైసీపీ సానుభూతిపరురాలు శ్రీరెడ్డి తాజాగా వీడియో రిలీజ్ చేసి పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. గతంలో యూట్యూబ్, సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్, లోకేష్, జనసేన, టీడీపీ నేతలను దూషించిన తీరుపై క్షమాపణలు కోరింది. తాజాగా వీడియోను రిలీజ్ చేసి ఎమోషనల్‌గా స్పందించింది. వైసీపీ పెద్దల అండదండలు చూసుకొని సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు, వ్యాఖ్యలు, వీడియోలతో పేట్రేగిపోయిన వైసీపీ యాక్టవిస్టులకు తత్వం బోధపడినట్లుంది. పోలీసులు చట్ట ప్రకారం కేసుల నమోదు చేసి, అరెస్టులు చేస్తుండటంతో వారిలో భయం మొదలైంది. కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నేతలు, వారి కుటుంబాల్లోని మహిళలపై నిత్యం అసభ్య పోస్టులతో చెలరేగిపోయిన.. శ్రీరెడ్డి విడుదల చేసిన ఓ వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆమె ఎవరెవరిపైన అసభ్య వ్యాఖ్యలు చేశారో వారందరికీ పేరుపేరునా క్షమాపణలు చెప్పారు. తనను ఏమీ చేయొద్దని, వదిలేయాలని కోరారు. మరికొంతమంది కూడా తాము చేసింది తప్పేనని క్షమించాలని కోరుతూ వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. వైసీపీ పెద్దలు ఆదేశిస్తేనే అసభ్య పోస్టులు పెట్టామని, తమను వదిలేయాలని కోరుతున్నారు.

ప్రభుత్వానికి సారీ చెప్పిన శ్రీరెడ్డి

సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించిన వేళ వైసీపీ క్యాడర్ సరెండర్ అవుతోంది. తాజాగా నటి శ్రీరెడ్డి ప్రభుత్వానికి సారీ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు బాధపడుతూ.. మంత్రులు లోకేశ్‌కు, పవన్ కల్యాణ్‌కు, అనితకు సారీ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. తన కుటుంబం, తన భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీరెడ్డి తెలిపారు.

శ్రీరెడ్డి దారుణ కామెంట్లు

తెలుగుదేశం, జనసేన నేతలపై దారుణంగా కామెంట్ చేసింది. లోకేష్, ఆయన తల్లి, భార్యను కూడా వదిలిపెట్టలేదు. అలాగే పవన్ కల్యాణ్‌ను అలాగే ఆయన సోదరుడు నాగబాబుపై దారుణమైన కామెంట్స్ చేసింది. దాంతో వీడియోలు వివాదాస్పదంగా మారాయి. అయితే గత ప్రభుత్వం అండ చూసుకొని వీడియోలు రిలీజ్ చేసి తీవ్రమైన ఆరోపణలు చేయడంపై ప్రస్తుతం చర్యలు చేపడుతున్నది. ఆ సమయంలో సోషల్ మీడియాను ఉపయోగించుకొని.. పవన్ కల్యాణ్‌ ఫ్యామిలీని టార్గెట్ చేసిన వైసీపీ సానుభూతిపరులను, కార్యకర్తలను అరెస్ట్ చేస్తుండటంతో శ్రీరెడ్డి ఈ వీడియోను రిలీజ్ చేసింది. తామంతా నేతల చేతుల్లోనే పావులం.. మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలంటే.. నేతలపై చర్యలు తీసుకోండి అని అన్నారు.


Tags

Next Story