YS Sharmila: ఏం పీక్కుంటారో పీక్కోండి... సొంతజిల్లాలో వైఎస్ షర్మిల పవర్ఫుల్ కామెంట్స్...

YS Sharmila:  ఏం పీక్కుంటారో పీక్కోండి... సొంతజిల్లాలో  వైఎస్ షర్మిల పవర్ఫుల్  కామెంట్స్...
ఏపీ కోసం ఎన్ని త్యాగాలైనా చేస్తానన్న- వైఎస్‌ షర్మిల

జగన్మోహన్‌ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో అతనికి వ్యతిరేకంగా బ్రదర్ అనిల్ కుట్రలు చేశారనే ఆరోపణలపై షర్మిల మండిపడ్డారు. భారతితో కలిసే తన భర్త అనిల్ సోనియాతో భేటీ అయ్యా రని స్పష్టం చేశారు. కడప జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో వైసీపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసుకుంటారో చేసుకోవాలని సవాలు చేశారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన మార్క్ రాజకీయం, సంక్షేమ పాలన అందించారని, రాజశేఖర్ రెడ్డి మార్కు, ఇప్పుడు జగనన్నపాలనలో ఎక్కడ ఉందని ప్రశ్నించారు. వైసిపి అధికారంలోకి తేవడానికి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కానీ వైసీపీ కోసం గొప్ప త్యాగం చేస్తే తన పైన మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి సంస్థలో తనకు సగం వాటా ఉందని, ఎన్ని నిందలు వేసినా నేను వైఎస్ షర్మిలా రెడ్డినేన్నారు. ఎన్ని నిందలు వేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే ..కడప జిల్లాకు కడప స్టీల్ వచ్చేదన్నారు. వైఎస్సార్ శంకుస్థాపన చేశారని, కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చి ఉంటే ... 20 వేల ఉద్యోగాలు వచ్చేవి...లక్ష మందికి పరోక్షంగా ఉపాధి దొరికేదన్నారు. రోజుకొక జోకర్ గాడు బయటికి వచ్చితన పైన వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారని, తన మీద బురద చల్లుతున్నారని ప్రణబ్ ముఖర్జీ చెప్పాడని, జగన్ జైల్లో ఉన్నప్పుడు..తన భర్త అనిల్ సోనియా ను కలిశారని చెప్పారని, జగన్‌ను బయటకు రానివ్వద్దని లాబియింగ్ చేశామని చెబుతున్నారని, ఇప్పుడు చెప్పడానికి ప్రణబ్ ముఖర్జీ లేరని చెప్పారు. పదవి ఆకాంక్ష ఉంటే...నాన్న ను అడిగి తీసుకోలేనా అని ప్రశ్నించారు. వైసీపీలో పదవి ఎందుకు తీసుకోలేదన్నారు. పదవి ఆకాంక్ష ఉంటే...మీకోసం నేను ఎందుకు మాట్లాడతానన్నారు.

అనిల్ , భారతి రెడ్డితో కలిసే సోనియా వద్దకు వెళ్ళారని, భారతికి తెలియకుండా సోనియా ను అడిగారా అని షర్మిల నిలదీశారు. భారతి రెడ్డి లేనప్పుడు అడిగారా అని ప్రశ్నించారు. కనీసం ప్రణబ్ ముఖర్జీ కూడా ఎక్కడ చెప్పినట్లు రికార్డ్ కూడా లేదన్నారు.


Tags

Read MoreRead Less
Next Story