Viveka Murder Case: 4గంటలుగా కొనసాగుతున్న ఎంపీ అవినాష్ విచారణ

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని విచారిస్తోంది సీబీఐ. దాదాపు 4 గంటలుగా విచారిస్తుంది. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి సమక్షంలో విచారణ చేస్తున్నారు. ఈ విచారణ ఆడియో, వీడియోలను రికార్డ్ చేస్తున్నారు సీబీఐ అధికారులు. వివేకా హత్యకు వాడిన గొడ్డలిపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సునీల్ యాదవ్ దాచిన గొడ్డలిపై ఆరా తీసినట్లు సమాచారం. వివేకా మరణ వార్తను జగన్‌కు మొదట చెప్పిందెవరని సీబీఐ అధికారులు ప్రశ్నించగా .. తనకు, హత్యకు సంబంధం లేదని అవినాష్ చెప్పినట్లు సమాచారం. ఇక అవినాష్ స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేస్తున్నారు.
మరోవైపు వివేకా హత్య కేసు నిందితుడు ఉమాశంకర్ రెడ్డి సోదరుడు.. జగదీశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లిన జగదీశ్ రెడ్డిపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం సీబీఐ కార్యాలయం నుంచి జగదీశ్ రెడ్డి వెళ్లిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com