MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ

MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరయ్యారు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. వివేకా హత్య కేసులో తొలిసారిగా సీబీఐ ముందుకు వచ్చారు అవినాష్‌రెడ్డి. వెనుక గేట్ ద్వారా సీబీఐ ఆఫీస్‌లోకి వెళ్లారు అవినాష్‌రెడ్డి.
ఆయనతో పాటు పెద్దఎత్తున అనుచరులు సీబీఐ ఆఫీస్ దగ్గరకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. సీబీఐ ఆఫీస్‌కు వెళ్లడానికి ముందు వైఎస్ విజయమ్మను కలిశారు అవినాష్‌రెడ్డి. లోటస్‌పాండ్‌లో విజయమ్మతో చర్చించారు.
మరోవైపు విచారణకు హాజరుకావడానికి ముందు సీబీఐకి వైఎస్ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్లు చెప్పారు. విచారణలో ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతించాలని కోరారు. తనతో పాటు న్యాయవాది ఉండేందుకు అనుమతివ్వాలన్నారు. అయితే అవినాష్‌రెడ్డి విజ్ఞప్తులపై సీబీఐ అధికారులు ఇప్పటిదాకా స్పందించలేదు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com