వివేకానంద రెడ్డి హత్య కేసు.. సునీల్ యాదవ్‌కు 14 రోజుల రిమాండ్‌

వివేకానంద రెడ్డి హత్య కేసు.. సునీల్ యాదవ్‌కు 14 రోజుల రిమాండ్‌
YS Viveka Murder Case: వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్‌కు పులివెందుల కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

YS Viveka Murder Case: వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్‌కు పులివెందుల కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. సునీల్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు.. నిన్న పులివెందుల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వివేకా హత్యలో సునీల్‌ కుమార్‌ యాదవ్‌ పాత్రపై ఆధారాలు లభించాయని సీబీఐ అధికారులు రిమాండ్‌ రిపోర్టులో స్పష్టంగా రాశారు. సునీల్‌ ప్రమేయంపై సెక్షన్‌ 164 కింద వాచ్‌మెన్‌ రంగన్న వాంగ్మూలం ఇచ్చారని సీబీఐ తెలిపింది. సునీల్‌ యాదవ్‌ను సుదీర్ఘ విచారణ చేయాలని భావించామని, అయితే విచారణకు హాజరు కాకుండా పారిపోయాడంటూ రిపోర్టులో పేర్కొంది.

సీబీఐకి చిక్కకుండా తిరుగుతున్న సునీల్ యాదవ్‌ను ఈనెల 2న గోవాలో అరెస్టు చేశామని అధికారికంగా ప్రకటించింది సీబీఐ. కుట్రకోణం వివరాలను గాని, సీబీఐ ప్రశ్నలకు సమాధానం గాని ఇవ్వడం లేదని, సునీల్‌ను కస్టడీకి ఇవ్వకపోతే దర్యాప్తు ఆలస్యం అవుతుందని రిమాండ్‌లో స్పష్టం చేశారు. సునీల్‌ను 13 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీంతో న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. హత్యకేసులో చాలా మంది సాక్షులను విచారించాల్సి ఉండడంతో పాటు హత్యకు వాడిన ఆయుధాలు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపింది సీబీఐ.

Tags

Read MoreRead Less
Next Story