Viveka Murder: వైఎస్‌ వివేకా హత్యకేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ..

Viveka Murder: వైఎస్‌ వివేకా హత్యకేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ..
Viveka Murder: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

Viveka Murder: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని అత్యుత్నత న్యాయస్థానం పేర్కొంటూ తీర్పును రిజర్వ్ చేసింది. సీబీఐ దర్యాప్తును ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టును వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత ఆశ్రయించడంతో.. దీనిపై జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపి.. తీర్పును రిజర్వ్ చేసింది.


సుప్రీం కోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాల్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది సీబీఐ. కేసులో నిందితులు.. దర్యాప్తు విచారణాధికారిపైనే తిరిగి కేసులు పెట్టారని తెలిపింది. మేజిస్ట్రేట్ ముందు 164 స్టేట్‌మెంట్ ఇస్తామన్న పోలీసు అధికారి శంకరయ్యకు ఏపీ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్ర పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారని పేర్కొంది. అందుకే విచారణలో జాప్యం జరుగుతోందని.... హత్య జరిగిన తర్వాత నిందితులు చెప్పినట్లుగా స్థానిక పోలీసులు వ్యవహరించారని సీబీఐ కౌంటర్‌లో తెలిపింది.


నిందితుల్ని విచారణ జరిపి, చార్జిషీటు దాఖలు చేయాల్సిన పోలీసులు.. చార్జిషీటు ఆలస్యం చేసి వారికి సహకరించారని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లో పేర్కొంది. దీనిలో అన్ని అంశాల్ని పూర్తిగా వివరించినట్లుగా సమాచారం. కాగా, సునీతా రెడ్డి వాదనలు అన్నింటికీ సీబీఐ మద్దతు తెలిపింది. ఆమె చెప్పేవన్నీ నిజాలేనని స్పష్టం చేసింది. సునీత పిటిషన్‌ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం ముందు సుమారు గంటపాటు వాదనలు సాగాయి.

Tags

Read MoreRead Less
Next Story