YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం..

YS Vivekananda Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరితో మరోసారి స్టేట్‌మెంట్ సేకరణ కోసం పులివెందుల కోర్టులో హాజరుపరిచారు సీబీఐ అధికారులు. దస్తగిరి చేత సెక్షన్ 164 కింద పులివెందుల మెజిస్ట్రేట్ ముందు స్టేట్‌మెంట్ నమోదు చేశారు.
సుమారు మూడు గంటల సేపు దస్తగిరి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ రికార్డు చేశారు. గతేడాది నవంబరు 26న దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు కడప కోర్టు అనుమతి ఇచ్చింది. ఆగస్టు 31న మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు దస్తగిరి.
దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ గతేడాది డిసెంబర్‌లో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను ఇటీవలే హైకోర్టు కొట్టివేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com