AP News: రాష్ట్రంలో కమ్ముకుంటున్న కరువు ఛాయలు

AP News: రాష్ట్రంలో కమ్ముకుంటున్న కరువు ఛాయలు
మొద్దు నిద్రతో కళ్లు తెరవని వైసీపీ ప్రభుత్వం

ఒకవైపు ప్రకృతి వైపరీత్యంమరోవైపు జగన్‌ సర్కారు పైత్యం అన్నదాతకు శాపంగా మారాయి. వందేళ్ల వ్యవసాయ చరిత్రలోఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో పంటల సాగు తగ్గిపోయింది. కరవుకు తోడు మిగ్‌జాం తుపాను రైతుల్ని నిండా ముంచింది. జగన్‌ సర్కార్‌ మాత్రం... పట్టుబట్టి మరీ పెట్టుబడి సాయాన్నీ తగ్గించింది. లక్షల ఎకరాలు.. పంటల్లేక బోసి పోతుంటే కర్షకులు, వ్యవసాయ కూలీలు కన్నీళ్లు పెడుతుంటే ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి జగన్‌.. నిర్దయగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌లో ఆర్తనాదాలను పట్టించుకోవడం లేదు.

రాష్ట్ర వ్యవసాయ రంగ చరిత్రలోఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి సాగు పడిపోయింది. 2023 జూన్‌ నుంచికరవు కరాళ నృత్యం చేస్తోంది. ఖరీఫ్, రబీ కలిపి 45 లక్షల ఎకరాల్లో విత్తనం పడలేదు. కరవు, తుపానులతో 43 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పైర్లు దెబ్బతింది. సాగు రంగంలో పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంటే వైకాపా సర్కార్‌ ఏం చేస్తోంది...? ఎండిపోయిన పంటల్ని పరిశీలించడానికి సీఎం జగన్‌ఇంతవరకు ప్యాలెస్‌ వదిలి బయటికి రాలేదు. కనీసం పరిస్థితిపై సమీక్షించలేదు. 'వ్యవసాయం సుసంపన్నం... రాష్ట్రానికి సౌభాగ్యం' అనే పుస్తకాలు విడుదల చేస్తూ సంబరపడిపోతున్నారు. రాయితీ విత్తనాలిచ్చామంటూ పదేపదే వల్లె వేస్తున్నారు. వానలే లేకపోతే విత్తనాలెలా వేస్తారనే ఇంగితం సర్కారుకు కరవైంది.ఆరు నెలలుగా అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నాకూలీల కుటుంబాలు ఆకలి కేకలు పెడుతున్నా జగన్‌ చెవికెక్కడం లేదు.

కరవు, పెట్టుబడి సాయం చేయడంలోనూ జగన్‌ సర్కార్‌ విఫలమైంది. ఖరీఫ్‌లో 56 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తే వానల్లేక, సాగు నీరందక 23 లక్షల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల పూర్తిగా ఎండిపోయాయి. ప్రభుత్వం మాత్రం ఏడు జిల్లాల్లోని 103 మండలాల్లోనే కరవు ఉన్నట్లు ప్రకటించింది. 14.21 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటనష్టం జరిగినట్లు గుర్తించి... పెట్టుబడి సాయంగా 847 కోట్లుగా నిర్ణయించింది. 2023 డిసెంబరు మొదటి వారంలో మిగ్‌జాం తుపాను 22 జిల్లాల్లో విలయం సృష్టించింది. 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 12 లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని కేంద్రానికి నివేదించిన ప్రభుత్వం ఆ తర్వాత మళ్లీ నాలుక మడతేసింది. పొలాల్లో నుంచి నీరు బయటకు వెళ్లిపోవడంతో నష్టం తగ్గిందంటూ... 6.64 లక్షల ఎకరాలకే పంట నష్టాన్ని కుదించింది. 442 కోట్లను పెట్టుబడి సాయంగా నిర్ణయించింది.ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర కరవు ఎదురైనప్పుడు సైతం.... ఇంత తక్కువ సాగు నమోదు కాలేదని వ్యవసాయశాఖలోని సీనియర్లు వివరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story