PAWAN: "దేవుడిపై పగబట్టిన వైసీపీ"

PAWAN: దేవుడిపై పగబట్టిన వైసీపీ
X
వైసీపీపై నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్

భగ­వం­తు­డి­పై వై­సీ­పీ పగ­బ­ట్టిం­ద­ని డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ ఆరో­పిం­చా­రు. సీఎం చం­ద్ర­బా­బు, బీ­జే­పీ రా­ష్ట్ర అధ్య­క్షు­డు మా­ధ­వ్భే­టీ అయిన ఆయన కీలక వి­ష­యా­ల­పై చర్చిం­చా­రు. హిం­దు­వు­లం­ద­రూ తి­రు­మ­ల­ను ఏడు కొం­డ­లు అని అం­టా­మ­ని, కానీ వా­ళ్లు రెం­డు కొం­డ­లు అని అం­టా­ర­ని ఆయన తె­లి­పా­రు. లడ్డూ నె­య్యి­లో బీఫ్, పంది కొ­వ్వు, ఫిష్ అయి­ల్ ఉం­ద­ని ఎన్డీ­డీ­బీ రి­పో­ర్టు ఇచ్చిం­ద­ని, దా­న్ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు తమకు చదవి వి­ని­పిం­చా­ర­ని పవన్ కల్యా­ణ్ గు­ర్తు చే­శా­రు. ఈ అం­శం­పై చర్చిం­చిన తర్వా­త­నే తాము మా­ట్లా­డ­ని తె­లి­పా­రు. పర్య­వ­సా­నా­లు ఆలో­చిం­చిన తర్వా­త­నే తాము మా­ట్లా­డా­మ­ని పవన్ పే­ర్కొ­న్నా­రు.ప్ర­జ­లు తమకు ఐదే­ళ్లు అధి­కా­రం ఇచ్చా­ర­ని, అలాం­టి­ది రా­జ­కీయ లబ్ధి­కో­సం మా­ట్లా­డా­ల్సిన అవ­స­రం తమకు లే­ద­న్నా­రు. కల్తీ నె­య్యి­తో అయో­ధ్య­కు లక్ష లడ్డూ­లు పం­పా­ర­ని, 59 లక్షల కే­జీల నె­య్యి కా­ద­ని, దా­న్ని కల్తీ పా­మా­యి­ల్ అనా­ల­ని పవన్ వ్యా­ఖ్యా­నిం­చా­రు. భో­లే­బా­బా డె­యి­రీ 58 లక్షల కే­జీల పా­మా­యి­ల్, లక్ష కి­లోల రసా­య­నా­లు కొ­ను­గో­లు చే­సిం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. వై­సీ­పీ పా­ల­న­లో హిం­దూ­మ­తం­పై చాలా దా­డు­లు జరి­గా­య­ని పవన్ కల్యా­ణ్ గు­ర్తు చే­శా­రు. వైసీపీ పాలన కాలంలో అనేక ఆలయాలకు సంబంధించిన ఘటనలు చోటు చేసుకున్నాయని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. రామతీర్థంలో శ్రీరామచంద్ర స్వామి విగ్రహం ధ్వంసం కావడం, దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగినప్పుడు “ఇవి పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు” అన్న తరహా వ్యాఖ్యలు రావడం భక్తులను తీవ్రంగా గాయపరిచిందని అన్నారు. అంతర్వేదిలో రథం దగ్ధమైతే, దాన్ని ఎవరో పిచ్చివాడు చేసిన పని అని తేల్చడం దేవుడిపట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని చూపిస్తుందని విమర్శించారు. ఈ అంశాలపై తాము చాలా అప్రమత్తంగా మాట్లాడుతున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా విశ్లేషించి స్పందిస్తున్నారని చెప్పారు. తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఎన్‌డీడీబీ నివేదికను ముఖ్యమంత్రి తమకు చదివి వినిపించారన్నారు. జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్, పంది కొవ్వు వంటి పదార్థాలు కలిసే అవకాశాలున్నాయని నివేదికలో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు.

వైసీపీ భక్తుల మనోభావాలను దెబ్బతీసింది: ఏపీ బీజేపీ చీఫ్

వై­సీ­పీ పా­ల­న­లో తి­రు­మల శ్రీ వేం­క­టే­శ్వర స్వా­మి ఆల­యం­లో ని­బం­ధ­న­లు పూ­ర్తి­గా ని­ర్వీ­ర్య­మ­య్యా­య­ని ఏపీ బీ­జే­పీ చీఫ్ మా­ధ­వ్ ఆరో­పిం­చా­రు. తి­రు­మల లడ్డూ ప్ర­సా­దా­ని­కి ఉప­యో­గిం­చే నె­య్యి వి­ష­యం­లో జరి­గిన అక్ర­మా­లు భక్తుల మనో­భా­వా­ల­తో పాటు ప్ర­జల ఆరో­గ్యా­న్ని కూడా ప్ర­మా­దం­లో­కి నె­ట్టా­య­ని ఆయన వ్యా­ఖ్యా­నిం­చా­రు. ఈ అం­శం­పై వై­సీ­పీ నే­త­లు బా­ధ్యత తీ­సు­కో­వా­ల్సిన అవ­స­రం ఉం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. డి­యా­తో మా­ట్లా­డిన మా­ధ­వ్, పాల సే­క­రణ సా­మ­ర్థ్యం లేని ఒక డె­యి­రీ సం­స్థ నుం­చి భా­రీ­గా నె­య్యి ఎలా సర­ఫ­రా జరి­గిం­దో వై­సీ­పీ ప్ర­భు­త్వం సమా­ధా­నం చె­ప్పా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు. నె­య్యి కాని పదా­ర్థా­ల­తో, రసా­య­నా­లు కలి­పి తయా­రు చే­సిన నె­య్యి­ని తి­రు­మల లడ్డూల తయా­రీ­లో ఉప­యో­గిం­చ­డం అత్యంత దా­రు­ణ­మ­ని ఆయన అన్నా­రు.భక్తుల వి­శ్వా­సా­న్ని తక్కు­వ­చే­సి, పవి­త్ర ప్ర­సా­దా­న్ని అప­వి­త్రం చే­శా­ర­ని వి­మ­ర్శిం­చా­రు.

Tags

Next Story