AP: ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా

AP: ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా
X
రాజ్యసభ ఛైర్మన్ కు రాజీనామా లేఖ అందించిన విజయసాయి రెడ్డి.. వైసీపీ ప్రయత్నాలు విఫలం

రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ కు రాజీనామా పత్రాన్ని అందజేశారు. రాజీనామా లేఖ సమర్పణకు ముందు విజయసాయితో వైసీపీ ఎంపీ గురుమూర్తి చర్చలు జరిపారు. అయినా వెనక్కి తగ్గని విజయసాయి.. రాజ్యసభకు చేరుకుని చైర్మన్ ధన్ ఖడ్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

విజయసాయి ఇంటికి వైసీపీ ఎంపీ

రాజకీయాలకు వీడ్కోలు పలుకుతున్నట్లు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి చేసిన ప్రకటనతో ఆ పార్టీలో ఆందోళన నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ తిరుపతి ఎంపీ గురుస్వామి.. విజయసాయి ఇంటికి వెళ్లి మాట్లాడారు. అయితే, గుడ్ బై విషయంపై మాట్లాడేందుకు వచ్చానని గురుస్వామి తెలిపారు. విజయసాయి నిర్ణయం ఆశ్చర్యంతోపాటు షాక్ కు గురిచేసిందని తిరుపతి ఎంపీ వెల్లడించారు.

ఢిల్లీకి "పిల్లి"

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయంతో ఏపీ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. విజయసాయి ప్రకటనతో వైసీపీ అధిష్టానం అలర్ట్‌ అయ్యింది. పార్టీ ఆదేశాలతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఢిల్లీ బయల్దేరారు. ఒత్తిడితోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తానని చెప్పి ఉండొచ్చని బోస్ ఇప్పటికే వెల్లడించారు. విజయసాయితో పిల్లి సుభాష్ చంద్రబోస్ సమావేశమయ్యే అవకాశం ఉంది.

జగన్ లండన్ నుంచి వచ్చేలోపు వైసీపీ ఖాళీ..!

జగన్ రెడ్డి ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. అక్కడ్నుంచే తన పార్టీ నేతల్ని బీజేపీలోకి పంపడానికి అవసరమైన చర్చలు పూర్తి చేశారని తెలుస్తోంది. ఆ చర్చల్లో భాగంగానే విజయసాయిరెడ్డి.. రాజీనామా ప్రకటించారని అంటున్నారు. జగన్ లండన్ నుంచి వచ్చేలోపు అందరూ రాజ్యసభ ఎంపీలు రాజీనామాలు చేసి బీజేపీలో చేరిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీతో ఏ ఒప్పందం జగన్ చేసుకున్నారన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

Tags

Next Story