17 March 2023 7:08 AM GMT

Simhachalam: వైఎస్సార్‌ సీపీ నేత హఠాన్మరణం..

Simhachalam: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాసరి రాజు (42) గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు.

Simhachalam:  వైఎస్సార్‌ సీపీ నేత హఠాన్మరణం..
X

Simhachalam: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాసరి రాజు (42) గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. సింహాచలం ప్రహ్లాదపురంలో నివాసం ఉంటున్న రాజుకు తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. వెంటన అతడిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వ్యక్తిగా రాజు మన్నలను పొందారు. శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి ప్రియ శిష్యుడు. 93వ వార్డులో ప్రజల అవసరాలు తీరుస్తూ పిలిస్తే పలికే నేతగా మన్ననలు పొందారు. దాసరి రాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజు తండ్రి అచ్చిబాబు కాంగ్రెస్ తరపున ఎంపీటీసీగా పని చేశారు.

Next Story