జగన్ అన్న స్టిక్కర్ పంచాయతి..కుక్కపై కేసు

వాళ్లేమో ఇంటింటికీ తిరిగి… కష్టపడి.. చెమటోడ్చుతూ స్టిక్కర్లు అంటిస్తున్నారు. సీన్ కట్ చేస్తే.. ఆ స్టిక్కర్లు గోడపై కాకుండా.. రోడ్డుపై కన్పిస్తున్నాయి. డ్రైనేజీలో తేలుతున్నాయి. వాళ్లు స్టిక్కర్లను అంటించడం.. వీళ్లు పీకేయడం.. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న తంతు ఇదే. జగనన్నా నువ్వే మా భరోసా అంటూ అంటించిన స్టిక్కర్‌పై ఓ కుక్క దృష్టి పడింది. ఆ స్టిక్కర్‌ను ఇలా అంటించారో.. లేదో ఆ శునకం అత్యంత చాకచక్యంగా గోడకున్న స్టిక్కర్‌ను పీకిపడేసింది. దీంతో కొందరి మనోభావాలు హర్ట్ అయ్యాయి. ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి క్రైమ్ చేసిన కుక్కపై ఫిర్యాదు చేశారు. ఆ కుక్కను.. దాని వెనకున్న శక్తులను లోపలెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో జరిగిన ఈ తతంగం చూస్తే.. నవ్వాలో.. ఏడవాలో తెలియడం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com