పుణ్యక్షేత్రాల్లో మంత్రులు, వైసీపీ నేతల అత్యుత్సాహం

పుణ్యక్షేత్రాల్లో మంత్రులు, వైసీపీ నేతల అత్యుత్సాహం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మంత్రులే క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడంపై భక్తులు మండిపడుతున్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో అన్యమత ప్రస్తావన తేవడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామునే తిరుమలేశుని దర్శనం చేసుకున్న తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడారు.
ప్రజలకు క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలని అవంతి శ్రీనివాస్ అంటే.. ఉప ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకు వేసి సీఎం జగన్‌కు వెంకన్న, ఏసు, అల్లా ఆశీస్సులు ఉండాలంటూ కోరుకున్నారు.తిరుమలలోనే కాదు చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమలలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇవాళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆ తర్వాత సీఎం జగన్‌కుకు, వైసీపీ కార్యకర్తలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పుణ్యక్షేత్రాల్లోనే మంత్రులు, MLAలు ఇలా మాట్లాడడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com