జగన్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్

జగన్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలంటూ  హైకోర్టులో పిటిషన్
వైఎస్సార్ కాంగ్రెస్ పేరు ఎవరూ వాడకుండా ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దుపై గురువారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. జగన్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలంటూ 'అన్న వైఎస్సార్ కాంగ్రెస్' పిటిషన్ వేసిన నేపథ్యంలో గురువారం జరిగే విచారణ ఉత్కంఠ రేపుతోంది. 'YSR కాంగ్రెస్' పేరు ఎవరూ వాడకుండా ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టులో 'అన్న YSR కాంగ్రెస్' పార్టీ జాతీయ అధ్యక్షులు మహబూబ్ బాషా, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వం ECIకి, జగన్ పార్టీకి నోటీసులు ఇచ్చింది. ఐతే.. ఇంత వరకూ వారు కౌంటర్ దాఖలు చేయలేదు. విచారణకు మరో వాయిదా కోరతారా, ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. తమకు కోర్టుల్లో న్యాయం జరుగుతుందని అన్న వైఎస్సార్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గురువారం విచారణ నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీ నాయకులంతా ఢిల్లీకి వెళ్లారు.
Tags

Read MoreRead Less
Next Story