ఉపాధి హామీ పనుల్లో వైసీపీ సర్పంచ్ అవినీతి బట్టబయలు

శ్రీసత్యసాయి జిల్లా ఉపాధి హామీ పనులలో వైసీపీ సర్పంచ్ అవినీతి బట్టబయలైంది. తన కుటుంబసభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనాథ్‌రెడ్డితో చేతులు కలిపి ఉపాధి హామీ డబ్బులు వసూలు చేస్తున్న వైనం వెలుగుచూసింది. తలుపుల మండలం రెడ్డేమవారిపల్లిలో వైసీపీ సర్పంచ్ తొలిసమ్మ అవినీతి బండారాన్ని అక్కడి స్థానిక యువకులు బయటపెట్టారు.
నాలుగుగ్రామాలకు చెందిన ఉపాధి హామీ 650 జాబ్ కార్డుదారుల నుంచి వారానికి 300 రూపాయల చొప్పున నెలకు 6 లక్షలు కొట్టేస్తున్నారు. ఈ దందాను సీక్రెట్‌గా వీడియో తీసిన గ్రామ యువకులు.. ఆధారాలతో సహా స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రత్యేకంగా మనుషులను పెట్టి ఉపాధి హామీ పనుల డబ్బులను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దాంతో వైసీపీ సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్‌పై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com