ఇడుపులపాయకు సోనియా, రాహుల్... కాంగ్రెస్ లో YSRTP విలీనం.!?

ఇడుపులపాయకు సోనియా, రాహుల్... కాంగ్రెస్ లో YSRTP విలీనం.!?
X
జులై 8వ తేదీన 11:30 గంటలకు ఇడుపులపాయ వద్ద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నివాళులు అర్పించనున్నట్లు సమాచారం

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనం లాంఛనమేనని ఎఐసీసీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కొద్దిసేపటి క్రితం షర్మిల భర్త అనిల్ కు ఎసిసిసి సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. అనిల్‌తో సోనియా, రాహుల్‌ పర్యటన గురించి వేణుగోపాల్‌ చర్చించినట్లు ఏఐసీసీ విశ్వసనీయ వర్గాల వెల్లడించాయి. ఇవాళ లేదా రేపు విజయమ్మ, షర్మిలతో సోనియాగాంధీ కూడా మాట్లాడుతారని అనిల్‌కు వేణుగోపాల్ తెలిపినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం కోసం జగన్ టార్గెట్‌గా కాంగ్రెస్ వ్యూహం సిద్ధం చేస్తోంది. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న తన తండ్రి కోరిక నెరవేర్చేందుకు కాంగ్రెస్ వైపు షర్మిల అడుగులు వేస్తున్నారు. వచ్చేనెల 8వ తేదీన ఇడుపులపాయకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రానున్నారు. ప్రత్యేక విమానంలో వారు ఢిల్లీ నుంచి ఇడుపులపాయకు చేరుకుంటారు. దివంగత రాజశేఖర్ రెడ్డి జన్మదినమైన జులై 8వ తేదీన 11:30 గంటలకు ఇడుపులపాయ వద్ద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నివాళులు అర్పించనున్నట్లు సమాచారం.

Tags

Next Story