Y.S.Viveka Murder: మళ్లీ సుప్రీంను ఆశ్రయించిన వైఎస్ సునీత

ఏపీలో సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సునీతారెడ్డి మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వుల్లో షరతులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో దర్యాప్తును జూన్ 30 నాటికి దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించినందున జులై 1న గంగిరెడ్డిని బెయిల్‌పై విడుదల చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.. అయితే, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు సునీత.. బెయిల్‌ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన ఉదంతాలు ఉన్నాయని.. సాక్షులను బెదిరించే అవకాశాలు ఉన్నాయని సునీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు.. హత్యలు చేసిన వాళ్లు బయట ఉంటే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.. సునీత పిటిషన్ వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
అటు వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల రిమాండ్‌ను జూన్ 2 వరకు సీబీఐ కోర్టు పొడిగించింది. దీంతో ఇద్దరిని తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. పులివెందుల్లో తీవ్ర టెన్షన్ మధ్యే.. వైఎస్ భాస్కర్ రెడ్డిని ఏప్రిల్ 16న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. భాస్కర్ రెడ్డిపై 130బీ, రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఫోన్‌ను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. పులివెందులలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్‌లో విచారణ అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి వైఎస్ భాస్కర్ రెడ్డిని తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీబీఐ మెజిస్ట్రేట్ ఎదుట వైఎస్ భాస్కర్ రెడ్డిని హాజరుపర్చగా ఆయన 14 రోజుల రిమాండ్ విధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com