Yuva Galam : "ముందస్తు అనుమతితోనే లోకేష్ పాదయాత్ర"

Yuva Galam : ముందస్తు అనుమతితోనే లోకేష్ పాదయాత్ర
సీఎం జగన్‌పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. 175 నియోజకవర్గాల్లో తిరుగుతా..... ఒక్కో కేసు ఎందుకు? ఒకే సారి 175 కేసులు పెట్టుకో జగన్ రెడ్డి అంటూ సవాల్‌ చేశారు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముందస్తు అనుమతితో టీడీపీ శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నామన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా. పాదయాత్రను కావాలనే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. లోకేష్‌ పాదయాత్రతో వైసీపీలో వణుకు మొదలైందన్నారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి రూల్స్ అతిక్రమిస్తున్నారని తెలిపారు. పాదయాత్ర అడ్డుకుంటే కోర్టులో దోషిగా నిలబడక తప్పదని హెచ్చరించారు. చట్టప్రకారం నడుచుకోమని డీఎస్పీ సుధాకర్‌రెడ్డికి వార్నింగ్‌ ఇచ్చారు. మైక్‌ లాగేస్తే యువగళం గొంతు ఆగిపోదని బోండా ఉమా స్పష్టం చేశారు.


సీఎం జగన్‌పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. 175 నియోజకవర్గాల్లో తిరుగుతా..... ఒక్కో కేసు ఎందుకు? ఒకే సారి 175 కేసులు పెట్టుకో జగన్ రెడ్డి అంటూ సవాల్‌ చేశారు లోకేష్‌. జగన్ అంటే జైలు- బాబు అంటే బ్రాండ్ అన్నారు. బాబు గారితో పోటీపడి తిరుమల కొండ ఎక్కే దమ్ముందా జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు. దీంతో ఎవరు యువకుడో, ఎవరు ముసలోడో తెలిసిపోతుందన్నారు. పరదాలు కట్టుకొని వెళ్ళే నీకు, నిత్యం ప్రజల్లో దైర్యంగా తిరిగే బాబుగారితో పోలికా? అంటూ ఎద్దేవా చేశారు లోకేష్‌.

Tags

Next Story