Yuvagalam: పసుపు మయంగా చిత్తూరు

లోకేష్ యువగళం పాదయాత్ర 15వ రోజుకు చేరింది. పాలసముద్రం నుంచి ఈ ఉదయం పాదయాత్ర ప్రారంభమైంది. గొల్లకండ్రిగ గ్రామస్థులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్‌కు గ్రామస్థులు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఉదయం 10.30కి ఎగవ కమ్మకండ్రిగలో రైతులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం దిగువ కమ్మకండ్రిగ చేరుకుని బెల్లం తయారీదారులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత కాపు కండ్రిగలో బలిజ, కాపులతో భేటీ అవుతారు. అనంతరం ఎస్సీ సామాజికవర్గీయులతో ముఖాముఖిలో పాల్గొంటారు. సాయంత్రం ఎస్ఆర్ పురం గ్రామస్థులతోనూ, ఆ తర్వాత ఎస్ఆర్ పురం హనుమాన్ టెంపుల్ వద్ద ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఇవాళ రాత్రి లోకేష్ అక్కడి బసచేస్తారు.
ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేష్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. యువ నేతకు అడుగడుగునా జననీరాజనం పలుకుతున్నారు. లోకేష్ పాదయాత్రతో చిత్తూరు జిల్లా పసుపుమయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, టీడీపీ జెండాలే దర్శనమిస్తున్నాయి. ఆయన పాదయాత్రగా వెళ్తుంటే రహదారుల వెంట టీడీపీ శ్రేణులు దండు కడుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com