Yuvagalam: లోకేష్‌ పాదయాత్రకే ఇలా అయితే బాబు రోడ్డెక్కితే ఏమౌతారు

Yuvagalam: లోకేష్‌ పాదయాత్రకే ఇలా అయితే బాబు రోడ్డెక్కితే ఏమౌతారు
డ్రోన్లు ప్రొటక్షన్‌కు వాడకుండా లోకేష్‌ పాదయాత్రపై అసత్య ప్రచారాలు చేయడానికి వాడటం పోలీసులకు సిగ్గుచేటు

లోకేష్‌ పాదయాత్ర చేస్తే వైసీపీ తట్టుకోలేదని ఆనాడే చెప్పానని,ఇప్పుడు అదే జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. లోకేష్‌ను చూస్తేనే ఇలా భయపడిపోతుంటే రేపు చంద్రబాబు రోడ్డు మీదకు వస్తే ఏమైపోతారంటూ సెటైర్లు వేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం గొల్లకండ్రిగలో టీడీపీ నేతలతో కలిసి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆయన ఫైరయ్యారు. డ్రోన్లు ప్రొటక్షన్‌కు వాడకుండా లోకేష్‌ పాదయాత్రపై అసత్య ప్రచారాలు చేయడానికి వాడటం పోలీసులకు సిగ్గుచేటన్నారు. లోకేష్‌ పాదయాత్రకు ఆటంకం కలిగిస్తే ప్రజలే తిరగబడతారంటూ ప్రభుత్వానికి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఘాటు వార్నింగ్‌ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story