Yuvagalam : తిరుపతి జిల్లాలో లోకేష్ పాదయాత్ర

తిరుపతి జిల్లాలో లోకేష్ పాదయాత్ర ఉత్సాహంగా సాగుతుంది. ప్రజా సమ్యలు తెలుసుకుంటూ యువ నేత ముందుకు సాగుతున్నారు. లోకేష్ వెంట వేలాది మంది యువత కదలుతున్నారు. లోకేష్ పాదయాత్ర తిరుపతి జిల్లాలోకి ఎంట్రీ కావడంతో టీడీపీ క్యాడర్లో మరింత జోష్ పెరిగింది. యువ నేతకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. వైసీపీ పాలనతో ఎదుర్కొంటున్న కష్టాలను ప్రజలు లోకేష్ దృష్టికి తీసుకొస్తున్నారు. అందరి సమస్యలు తెలుసుకుంటున్న లోకేష్ త్వరలోనే మంచి రోజులు వస్తాయని ప్రజలకు భరోసా ఇస్తున్నారు
మరోవైపు పాదయాత్రలో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. తిరుపతి జిల్లాలోకి ఎంట్రీ కాగానే అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. మఫ్తీలో వచ్చిన పోలీసులు టీడీపీ కార్యకర్తలో కలిసిపోయి లోకేష్ వెంటే తిరుగుతున్నారు. కెమెరాల ద్వారా పాదయాత్రను చిత్రీకరిస్తున్నారు. ఇక పోలీసులు తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులు ప్రభుత్వం చెప్పిన మాటలు విని.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com