Yuvagalam: జబర్దస్త్‌ ఆంటీని వదిలేది లేదు: లోకేష్

Yuvagalam: జబర్దస్త్‌ ఆంటీని వదిలేది లేదు: లోకేష్
X
రాజకీయాల్లో సంస్కారంగా మాట్లాడటం రోజా నేర్చుకోవాలి

మంత్రి రోజాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. రోజాకు గౌరవంగా చీర, గాజులు ఇచ్చేందుకు తెలుగు మహిళలు వెళ్తే పోలీసులు దారుణంగా కొట్టడమేంటని ఫైర్ అయ్యారు. జబర్దస్త్ ఆంటీ రోజాను వదిలేది లేదన్న లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలన్నారు. రాజకీయాల్లో సంస్కారంగా మాట్లాడటం రోజా నేర్చుకోవాలని హితువు పలికారు.

అంతకుముందు యువగళం పాదయాత్రలో భాగంగా సత్యవేడు నియోజకవర్గం వెంకటరెడ్డికండ్రిగలో మహిళలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. జగన్ పాలనలో తాము పడుతున్న సమస్యలను యువనేతకు వివరించారు మహిళలు. సైకోరెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లోకేష్ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Tags

Next Story