Yuvagalam : జగన్ ను జైలు పిలుస్తోంది : లోకేష్

Yuvagalam : జగన్ ను జైలు పిలుస్తోంది : లోకేష్
X
మండుటెండల్లోనూ ప్రజలు ఉత్సాహంగా యువగళం పాదయాత్రలో భాగమవుతున్నారు

రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ఆగడాలు శృతిమించిపోయాయని నారా లోకేష్ ఆరోపించారు. జగన్‌ను జైల్లు పిలుస్తున్నాయని లోకేష్ అన్నారు. చంద్రబాబును చూస్తే రాష్ట్రానికి కొత్త కంపెనీలు వస్తాయని తెలిపారు. ప్రజల తరపున పోరాడుతున్న తెలుగుదేశం గొంతును జగన్ మోహన్ రెడ్డి నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

మండుటెండల్లోనూ ప్రజలు ఉత్సాహంగా యువగళం పాదయాత్రలో భాగమవుతున్నారు. ప్రజలతో మమేకమైన లోకేష్.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 24వ రోజు కోబాక విడిది కేంద్రం నుంచి పాదయాత్రను ప్రారంభించిన లోకేష్ స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొత్తవీరాపురంలో స్థానికులతో సమావేశమయ్యారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని గ్రామస్తులు లోకేష్‌కు మొరపెట్టుకున్నారు. సదాశివపురం సర్కిల్ లో స్థానికులు అభిమానంతో లోకేష్‌ను చుట్టుముట్టారు. మడిబాక పంచాయతీలో రైతులతో ముఖాముఖి సంభాషించనున్నారు లోకేష్


పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా సాగుతోంది. సమస్యలతో తనవద్దకు వచ్చే ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఓపికగా సమస్యలు వింటున్నారు. వారి సమస్యలకు పరిష్కారానికి హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. లోకేష్‌కు మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్నారు.


Tags

Next Story