Yuvagalam : డాక్టర్లపై లోకేష్ ప్రశంసల జల్లు

Yuvagalam : డాక్టర్లపై లోకేష్ ప్రశంసల జల్లు
అధికారంలోకి వచ్చాక ఆర్ఎంపీ బోర్డు ఏర్పాటు చేసి.. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అందిస్తామని చెప్పారు

డాక్టర్లపై టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రశంసల జల్లు కురిపించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని కొనియాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే 429 జీవోలో సవరణలు తీసుకొస్తామన్నారు. జగన్ పాలనలో ప్రభుత్వాస్పత్రుల్లో మెడిసిన్ కొరత ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధి కారంలోకి వచ్చాక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌ఎంపీ డాక్టర్లను భాగస్వామ్యం చేస్తామన్నారు. ఆర్ఎంపీ బోర్డు ఏర్పాటు చేసి.. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అందిస్తామని చెప్పారు.


అంతకుముందు గాజులమండ్యంలో రెవెన్యూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. లోకేష్‌ పాదయాత్రకు చెందిన జెండాలు, ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల అడ్డగింత చర్యలకు రెవెన్యూ సిబ్బంది తోడవ్వడంపై మండిపడ్డారు. అనంతరం ముందుకుసాగిన యువగళం పాదయాత్ర రేణిగుంట వై కన్వెన్షన్ సెంటర్‌ వరకు సాగింది. అక్కడ ఆర్‌ఎంపీ డాక్టర్లతో సమావేశమయ్యారు.


రేణిగుంట యాదవ సామాజిక వర్గీయులతో నారా లోకేష్ భేటీ అయ్యారు. అనంతరం స్థానిక బస్టాండ్‌ సమీపంలో దుకాణదారులతో సమావేశం అవుతారు. తర్వాత తిరుపతి అంకుర హాస్పిటల్‌ వరకు లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో లోకేష్ బస చేస్తారు. ఇక లోకేష్‌ పాదయాత్రకు నీలిసానిపేట ఎస్టీ కాలనీ వాసులు అపూర్వస్వాగతం పలికారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా లోకేశ్‌ చేపట్టిన పాదయాత్ర 25వ రోజు రేణిగుంట మండలం జీపాలెం నుంచి ప్రారంభమయింది.


Tags

Read MoreRead Less
Next Story