Yuvagalam : తిరుచానూరులో లోకేష్ పాదయాత్ర

Yuvagalam : తిరుచానూరులో లోకేష్ పాదయాత్ర

తిరుచానూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. నారా లోకేష్‌కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్న లోకేష్ వెంట.. మేముసైతం అంటూ సాగుతున్నారు. కాసేపట్లో తిరుచానూరు ప్రజలతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత వసుంధర నగర్‌ వాసులతో సమావేశం కానున్నారు. అనంతరం తనపల్లిలో రైతులతో లోకేష్ భేటీ కానున్నారు.

కొద్దిసేపటి క్రితం నారా లోకేష్ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలోకి చేరుకున్న లోకేష్‌కు.. పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అమ్మవారి లఘుదర్శనం తర్వాత.. తీర్థ ప్రసాదాలను టీటీడీ అధికారులు అందజేశారు.

అమ్మవారి ఆలయం నుంచి లోకేష్ బయటకు రాగానే సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ఆలయ సమీపంలోని వ్యాపారులు లోకేష్‌పై తమ అభిమానం చాటుకున్నారు. పూలు అమ్ముకునే మహిళ లోకేష్‌కు పూలదండ వేసింది. పూసలు అమ్ముకునే షికారి మహిళ లోకేష్ మెడలో పూసల దండ వేసి.. అభిమానం చూపింది. వారి ఆదరాభిమానాలకు ముగ్దుడైన లోకేష్.. షికారి మహిళలను ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటో దిగారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు భాగ్యనగరంలో బీసీ సామాజిక వర్గీయులతో లోకేష్‌ భేటీ కానున్నారు. 2గంటల 10 నిమిషాలకు భాగ్యనగరం నుంచి పాదయాత్ర కొనసాగిస్తారు. మార్గమధ్యలో కాపుచంద్రపేట, దుర్గ సముద్రం, అడపారెడ్డిపల్లి స్థానికులతో మాట్లాడుకుంటూ యాత్రను కొనసాగించనున్నారు. సాయంత్రం 5గంటల 25 నిమిషాలకు శివగిరి విడిది కేంద్రంలో బస చేయనున్నారు యువనేత. ఇప్పటి వరకు లోకేష్ 354 కిలోమీటర్ల మేర నడక సాగించారు.

Next Story