Yuvagalam: యువగళానికి ఎన్నారైల సంఘీభావం

Yuvagalam: యువగళానికి ఎన్నారైల సంఘీభావం
X
నారా లోకేష్ పాదయాత్రకు వస్తున్న అపూర్వ స్పందనను చూస్తుంటే ప్రజలు ఎన్ని కష్టాల్లో ఉన్నారో తెలుస్తోంది

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆస్ట్రేలియా లోని అడిలైడ్ లో తెలుగుదేశం అభిమానులు, సానుభూతిపరులు సంఘీభావ సమావేశం నిర్వహించారు. ఇటీవలే మరణించిన యువ హీరో తారకరత్నకు నివాళులర్పించారు. ఎంతో భవిష్యత్ ఉన్న తారకరత్న చిన్న వయసులో నే గుండెపోటు తో తిరిగి రాని లోకాలకు వెళ్లడం తమను తీవ్రంగా కలిచి వేసిందన్నారు.

సంఘీభావ సమావేశంలో.. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు వస్తున్న అపూర్వ స్పందన ను చూస్తుంటే ప్రజలు ఎన్ని కష్టాల్లో ఉన్నారో అర్ధమంవుతుందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనను ప్రశ్నిస్తూ సాగుతున్న యువగళం పాదయాత్రకు ఆటంకాలు సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అడిలైడ్ స్పష్టం చేసింది.

Tags

Next Story