Yuvagalam: బీసీలంటే జగన్‌కు చులకన: లోకేష్

బీసీలంటే జగన్‌కు చులకన అని విమర్శించారు నారా లోకేష్. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలపై దొంగ కేసులు పెడుతున్న పోలీసులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారుయువగళం పాదయాత్ర లో భాగంగా మామండూరులో సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. సెల్ఫీ దిగేందుకు వచ్చిన అభిమానులు, టీడీపీ కార్యకర్తలను లోకేష్ ఆప్యాయంగా పలుకరించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రజక సామాజిక వర్గం ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. రజకుల సమస్యలు విన్న లోకేష్ అధికారంలోకి రాగానే వారి సమస్యలను పరిష్కరిస్తానని భరోసా కల్పించారు.
యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య ..యువత కేరింతలు, డప్పుల మోత, పూల వర్షంతో హుషారుగా సాగుతోంది. పాదయాత్రకు ఊరూరా ఘన స్వాగతం లభిస్తోంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. మంగళ హారతులతో మహిళలు లోకేష్‌కు స్వాగతం పలుకుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com