Yuvagalam: పెనుగొండలో లోకేష్.. ప్రజలకు భరోసానిస్తూ

లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పెనుగొండ నియోజకవర్గంలో ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. ఊరూవాడ లోకేష్‌కు ఎదురేగి ఘన స్వాగతం పలుకుతున్నారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో పాటు.. పెద్ద ఎత్తున ప్రజలు యాత్రలో లోకేష్‌తో కలిసి నడుస్తున్నారు. మరోవైపు యువగళం యాత్రలో పలు సామాజిక వర్గాలతో లోకేష్ సమావేశం అవుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానేఏ సమస్యలు పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు యువగళం పాదయాత్రలో లోకేష్‌ను కలిశారు నెల్లూరు రూరల్ నియోజక వర్గ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.ఇటీవలే పార్టీలో చేరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు మర్యాదపూర్వకంగా లోకేష్‌ను కలిశారు.
జీనబండ్లపల్లిలో నాయీ బ్రాహ్మణులతో సమావేశం అయిన లోకేష్... తిప్పరాజుపల్లి వద్ద భోజన విరామం తీసుకున్నారు. మధ్యాహ్నం 2గంటల 25 నిమిషాలకు గోరంట్లలో స్థానికులతో లోకేష్ భేటీ కానున్నారు. అనంతరం 3 గంటల 40 నిమిషాలకు గోరంట్ల ఆర్టీసీ సర్కిల్ వద్ద స్థానికులతో మాటామంతీలో పాల్గొంటారు. 4.30 నిమిషాలకు గుమ్మయ్యగారిపల్లి వద్ద బహిరంగసభలో లోకేష్ ప్రసంగిస్తారు. 6.15 నిమిషాలకు పాదయాత్రగా గుమ్మయ్యగారి పల్లికి లోకేష్ చేరుకుంటారు. రాత్రికి అక్కడే విడిది కేంద్రంలో లోకేష్ బస చేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com