Yuvagalam : నేడు ధర్మవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర

Yuvagalam : నేడు ధర్మవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర
X

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళ పాదయాత్ర 57వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు దాదాపు 720 కిలోమీటర్లు నడిచిన లోకేష్‌... ఇవాళ మరో 12 కిలోమీటర్లు నడవనున్నారు. ఇవాళ ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రవేశించనుంది. ఇవాళ పైదిండి క్యాంప్‌ సైట్‌ నుంచి లోకేష్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. పట్టు కార్మికులు, వ్యాపారులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం పైదిండిలో స్థానికులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంటకు నామాల క్రాస్ వద్ద ఆత్మకూరు కార్మికులతో భేటీ అవుతారు. అనంతరం..లోకేష్‌ పాదయాత్ర ధర్మవరం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే టిడ్కో గృహా ల బాధితులతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఇందిరమ్మ కాలనీలో చేనేత కార్మికులతో భేటీ అయి వారి సమస్యలు తెలుసుకుంటారు. ఇక పోతులనాగపల్లి స్థానికులతో సమావేశమై వారి సమస్యలు వింటారు. సాయంత్రం పార్థసారధినగర్ నుంచి తిరిగి పాదయాత్ర కొనసాగిస్తారు. ఆ తర్వత బలిజ సామాజికవర్గీయులతో సమావేశం కానుంది. అనంతరం... మదీనా మసీదులో ప్రార్థనలు, ముస్లిం పెద్దలతో భేటీ అవుతారు. రాత్రి 7 గంటల సమయంలో అంజుమన్ సర్కిల్లో స్వర్ణకారులతో సమావేశమైన వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం.... కన్యాకాపరమేశ్వరి గుడి సమీపంలో ఆర్యవైశ్యులతో భేటీ అవుతారు. రాత్రి సిఎన్ బి గ్రాండ్ వద్ద విడిది కేంద్రంలో బస చేస్తారు.

Next Story