Yuvagalam : వైసీపీ ఎమ్మెల్యేల గుండెల్లో నారా లోకేష్ గుబులు

Yuvagalam : వైసీపీ ఎమ్మెల్యేల గుండెల్లో నారా లోకేష్ గుబులు
X

యువగళం పాదయాత్రతో వైసీపీ ఎమ్మెల్యేల గుండెల్లో నారా లోకేష్ గుబులు పుట్టిస్తున్నారు. కుప్పం టు ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేస్తున్న లోకేష్.. అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యే అరాచకాలను బయటపెడుతున్నారు. ప్రజా సేవ పేరుతో జనం సొమ్మును లూటీ చేస్తున్న నేతల బండారం వెలుగులోకి తీసుకొస్తున్నారు నారా లోకేష్‌. ఇక తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

గుడ్‌ మార్నింగ్‌ టు కేతిరెడ్డి అంటూ ప్రజల్లోకి వచ్చే కేతిరెడ్డికి బ్యాడ్ మార్నింగ్‌ టు కేతిరెడ్డి అని లోకేష్ పరిచయం చేశారు. ధర్మవరంలో కేతిరెడ్డి ఇసుక దందా కొనసాగిస్తున్నారని లోకేష్‌ ఆరోపించారు. అందుకు సాక్ష్యం ఇదుగో అంటూ ఇసుక లారీల వద్ద సెల్ఫీలు తీసుకున్నారు. కేతిరెడ్డి ఆధ్వర్యంలోనే ఇసుక అక్రమ దందా కొనసాగుతుందని మండిపడ్డారు. ఉదయాన్ని గుడ్ మార్నింగ్‌ అంటూ ప్రజల్లోకి వెళ్తున్న కేతిరెడ్డి... సెటిల్మెంట్లతో ప్రభుత్వ సొత్తును కాజేస్తున్నారని ఆరోపించారు.


ఇక నిన్న గుడ్‌మార్నింగ్‌ కబ్జా అంటూ కేతిరెడ్డిని పలకరించారు లోకేష్‌. ఇప్పటికే పెనుగొండ, రాప్తాడులో పర్యటించి.... అక్కడి వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిని, భూదందాను ఎండగట్టారు. తాజాగా ఇప్పుడు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భకబ్జాను వెలుగులోకి తెచ్చారు. ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను కేతిరెడ్డి ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారన్నారని ఆరోపించారు. కేతిరెడ్డి ఆక్రమించిన ప్రదేశంలో సెల్ఫీ దిగి... ఆయన భూకబ్జాను బయపెట్టారు లోకేష్. గుట్టపై విలాసవంతమైన భవనంతో పాటు అందులో రేసింగ్ ట్రాక్, గుర్రపు స్వారీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారన్నారు. టీడీపి అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూకబ్జాలపై ప్రత్యేక బృందంతో విచారణ చేయిస్తామన్నారు.

ఇన్నాళ్లుగా తనకు ఎవరు ఎదురు చెప్పేవారే లేరని కేతిరెడ్డి రెచ్చిపోయారని.. తన అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకే ఇక్కడికి వచ్చినట్లు లోకేష్ చెప్పారు. యువగళం పాదయాత్రతో ఎమ్మెల్యేల ఆగడాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. వైసీపీ నేతల అక్రమ సామ్రాజాన్ని కూల్చే వరకు వెనక్కి తగ్గేదే లేదని లోకేష్‌ స్పష్టం చేశారు.

Next Story