Yuvagalam : బీసీలకు పెద్దపీట వేస్తాం: నారా లోకేష్

Yuvagalam : బీసీలకు పెద్దపీట వేస్తాం: నారా లోకేష్
వైసీపీ మాయ మాటలు నమ్మి పాలిచ్చే ఆవును కాదని దున్నపోతును తెచ్చుకున్నారని అన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హామీ ఇచ్చారు.. యువగళం పాదయాత్రలో భాగంగా ఉరవకొండ నియోకజవర్గంలో బీసీలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.. బడుగు, బలహీనవర్గాలకు ఆనాడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తీసుకొచ్చిందే టీడీపీ అని గుర్తు చేశారు.. జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో ఫీజురీయింబర్స్‌మెంట్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టారని ఫైరయ్యారు.. అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని లోకేష్‌ హామీ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చాక బీసీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని.. మండల స్థాయి నుంచి ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తామని లోకేష్‌ చెప్పారు.. వైసీపీ మాయ మాటలు నమ్మి పాలిచ్చే ఆవును కాదని దున్నపోతును తెచ్చుకున్నారని అన్నారు.. ఒక విధానమంటూ లేకుండా బీసీలకు జగన్‌ తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు.. చంద్రబాబు ప్రమాద బీమా పథకాన్ని తీసుకొస్తే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కరికి కూడా బీమా ఇవ్వలేదన్నారు.

పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకొచ్చే లక్ష్యంతో ఏ ప్రభుత్వమైనా ఫెడరేషన్‌, కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తుందని.. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల సొంత నాయకులకు ఉద్యోగాలు కల్పించడం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని విమర్శించారు.. కొన్ని కార్పొరేషన్లలో కనీసం కుర్చీలు, టేబుళ్లు కూడా లేవన్నారు.. ఎక్కడా ఆ ఉప కులాలకు చెందిన వారిని ఆర్థికంగా ఆదుకున్న లక్ష్యంతో పెట్టలేదన్నారు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ల ద్వారా అందరికీ లబ్ధిచేకూరుస్తామని లోకేష్‌ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story