Yuvagalam: నేడు తాడిపత్రిలో లోకేష్‌ పాదయాత్ర

Yuvagalam: నేడు తాడిపత్రిలో లోకేష్‌ పాదయాత్ర
లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు

లోకేష్ యువగళం పాదయాత్ర ఇవాళ 67వ రోజుకు చేరింది. ఇవాళ తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర జరగనుంది. ఇక ఇవాళ పాదయాత్ర తాడిపత్రిలో ఎంటరవుతుండటంతో.. లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు టీడీపీ శ్రేణులు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో లోకేష్‌కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారు.

కాసేపట్లో ఉలికుంటపల్లి నుంచి లోకేష్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం.. సింగంగుట్టపల్లిలో స్థానికులతో మాటమంతీ నిర్వహిస్తున్నారు. అనంతరం.. తబ్దుల్లా-1 వద్ద స్థానికులతో భేటీ అవుతారు. అనంతరం చాగల్లులో మత్స్యకారులతో సమావేశమవుతారు. ఉ.11 గంటలకు పెదపప్పూరు శివార్లలో దూదేకులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం. భోజన విరామస్థలంలో బుడగజంగాలతో సమావేశమవుతారు.

సాయంత్రం 4 గంటలకు పెదపప్పూరు నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం సుంకులమ్మ కాలనీలో చేనేతలు, స్థానికులతో భేటీ అయ్యారు. పెదపప్పూరు పోలీస్ స్టేషన్ వద్ద రజకులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం రామకోటి వద్ద బుడగజంగాలతోనూ, పెదపప్పూరు జడ్పీహైస్కూల్ వద్ద విద్యార్థులతో భేటీ అవుతారు. అనంతరం...చినపప్పూరులో స్థానికులతో సమావేశమై వారి సమస్యల్ని తెలుసుకుంటారు. గార్లదిన్నెలో స్థానికులతో సమావేశమవుతారు. రాత్రి 7 గంటలకు పసలూరులో ఉంటారు.

Tags

Read MoreRead Less
Next Story