Yuvagalam : జై లోకేష్‌ నినాదాలతో దద్దరిల్లిన తాడిపత్రి

Yuvagalam : జై లోకేష్‌ నినాదాలతో దద్దరిల్లిన తాడిపత్రి
ఎమ్మెల్యే అవినీతిని కచ్చితంగా తాను ఎండగడతానని తెలిపారు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా యువనేతకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ను తాడిపత్రి డీఎస్పీ చైతన్యకలిశారు. ఫ్యాక్షన్ నియోజకవర్గం కావడంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దంటూ లోకేష్‌ కు డీఎస్పీ సూచించారు. దీంతో డీఎస్పీకి లోకేష్ అదిపోయే సమాధానం చెప్పారు.గత 67 రోజులుగా నేను పాదయాత్ర చేస్తున్నా....ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ అవినీతిని.. ఎమ్మెల్యే అవినీతిని కచ్చితంగా తాను ఎండగడతానని తెలిపారు. నోటీసులు తీసుకోవాలని డీఎస్పీ కోరగా.. అందుకు లోకేష్ నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక పాదయాత్ర ఆర్గనైజర్స్‌కు డీఎస్పీ నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మంగళవారం ఉదయం. తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్ర ప్రవేశించింది. ఈ క్రమంలో లోకేష్‌కు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తాడిపత్రికి చేరుకుని లోకేష్‌కు పూలమాలతో స్వాగతం పలికారు.

ఉలికుంటపల్లి విడిది కేంద్రం వద్ద మహనీయుడు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి లోకేష్, టీడీపీ ముఖ్య నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. అణ‌గారిన‌వ‌ర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయుని స్మృతిలో నివాళులు అర్పిస్తున్నట్లు లోకేష్ తెలిపారు.దారిపొడవునా జనం బారులు తీరారు. లోకేష్‌ను చూసేందుకు, ఆయనతో తమ సమస్యలు చెప్పుకునేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. జై టీడీపీ, జై లోకేష్‌ నినాదాలతో తాడిపత్రి దద్దరిల్లింది. అడుగడుగునా యువనేతకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రం మొత్తం జనసునామీని తలపిస్తోంది. యువనేతను చూసేందుకు..ఆయన వెంట నడిచేందుకు యువత ఉత్సాహం చూపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story