Yuvagalam: ఆదోని నియోజకవర్గంలో లోకేష్ గ్రాండ్‌గా ఎంట్రీ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఊరువాడ తేడా లేకుండా ఉప్పెనై కదిలివస్తున్న జనంతో.. యువగళం హోరెత్తుతోంది. ఆదోని నియోజకవర్గంలో లోకేష్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. యువనేతకు మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. యువనేతకు ఎదురెళ్లి.. మంగళ హారతులతో అపూర్వ స్వాగతం పలుకుతున్నారు.
76వ రోజు ఉదయం 7 గంటలకు ములిగుండం శివారు విడిది కేంద్రం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. సమీప గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పొలంలో జరుగుతున్న వ్యవసాయ కూలీల వద్దకు వెళ్లారు. వారితో కలిసి పనులు చేపట్టారు. అనంతరం యువనేతకు తమ సమస్యలు చెప్పుకునేందుకు పెండేకల్ గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. నకిలీ విత్తనాలు, పెరిగిన పురుగుమందుల ధరలతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు అన్నారు. గిట్టుబాటు ధర లేక అప్పుల పాలయ్యామని అన్నదాతల ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రైతులకు లోకేష్ ధైర్యం చెప్పారు. ఒక్క ఏడాది ఓపిక పట్టాలని.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com