Yuvagalam: ఆదోనిలో యువగళం ప్రభంజనం

ఏపీలో యువగళం ప్రభంజనం కొనసాగుతుంది. ఇవాల్టితో పాదయాత్ర 78వ రోజుకు చేరింది. ప్రస్తుతం ఆదోని నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు లోకేష్. కాసేపట్లో కడితోట క్రాస్ క్యాంప్ నుంచి ప్రారంభం కానుంది. యాత్రలో భాగంగా గనేకల్, జాలిమంచి క్రాస్ వద్ద స్థానికులతో భేటీ కానున్నారు లోకేష్. యువనేత పాదయాత్ర జనసునామీని తలపిస్తోంది. లోకేష్‌కు అడుగడుగునా జననీరాజనం అందుతుంది. ప్రతి గ్రామంలో మంగళహారతులతో లోకేష్‌కు మహిళలు స్వాగతం పలుకుతున్నారు. యువనేత వెంట వేలాది మంది అడుగులో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో భాగంగా లోకేష్‌కు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. అందరి సమస్యలు ఓపికగా వింటున్న లోకేష్.. టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com